Site icon NTV Telugu

Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం..

Falaknuma

Falaknuma

Falaknuma Express: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 6 బోగీలకు వ్యాపించిన మంటలు.. పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read also: Bandi Sanjay: కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్‌.. బోరున ఏడ్చినకార్యకర్తలు

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో బోగీలు దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. లోకో పైలట్ గమనించి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రైలును అక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.

Exit mobile version