NTV Telugu Site icon

Water Packets: ఘట్కేసర్‌ లో నకిలీ నీళ్ల ప్యాకెట్లు.. ప్రాణాలతో చెలగాటం

Water Nakili In Ghatkeser

Water Nakili In Ghatkeser

Water Packets: నీళ్లు.. స్వచ్చతకు నిదర్శం. నీటిని రోజుకు 6 బాటిళ్లైనా తాగాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఎండ ఎక్కువ కావడం వల్ల చిన్న, పెద్ద ఎవరికైనా సరే దాహార్తి తీర్చుకోవాలని వాటర్ ప్యాకెట్లు తీసుకుంటారు. ఎందుకంటే వాటర్ ప్యాకెట్లు 5 రూపాయలకే వస్తాయి కాబట్టి. అయితే కొందరు ఇదే అదునుగా భావించి మార్కెట్ లోకి నకిలీ నీళ్లను బయటకు పంపుతున్నారు. వాటి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నీటితో పాటు, పాలు, టీ, కాఫీ, నెయ్యి, పన్నీర్, కోవా వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తారు. అలాంటి స్వచ్చమైన నీటిని కూడా నకిలీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో తాగే నీటి నుంచే తినే తిండి వరకు ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. ఉప్పు, కారం, పాలు, నీళ్లు, ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ కల్తీనే. ఇక నకిలీకి.. అసలును గుర్తుపట్టడం కష్టమే. దీంతో నకిలీ పదార్థాలను తీసుకోవడం వలన ప్రజలు ప్రాణాలతో పోరాడుతున్నారు. గతంలో పాలు కల్తీ చేస్తున్న సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నకిలీ నీళ్ల తయారీ కేంద్రంలో ఎస్వోటి పోలీసులు దాడి చేశారు.

Read also: Rakul Preeth Singh: పెళ్లి తర్వాత రూటు మార్చిన రకుల్.. హాట్ పోజులతో ట్రీట్..

మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘాట్కేసర్ టౌన్ బాలాజీ నగర్ కాలనీలో నకిలీ నీళ్ళ ప్యాకెట్ల తయారీ కేంద్రం పై మల్కాజిగిరి జోన్ ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు చేశారు. ఆహార భద్రత సంస్థ (FSSAI) నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నకిలీ నీళ్ళ ప్యాకెట్లు తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఘటన వద్దకు చేరుకున్నారు. ఈ దాడుల్లో టాట్ – యూ (TAT – U) లోగోతో కూడిన 1800 వందల నకిలీ నీళ్ళ ప్యాకెట్లు, అంటే 20 బ్యాగుల నకిలీ నీళ్ళ ప్యాకెట్లు ఒక్కో బ్యాగులో 90 నీళ్ళ ప్యాకెట్లు ఉంటాయి,ఒక మనుఫ్యాక్చరింగ్ మెషీన్..రెండు ప్యాకేజింగ్ కవర్ బండల్..ఒక బ్యాగ్ క్లోజ్ స్టిచింగ్ మెషీన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ నీళ్ళ ప్యాకెట్ల తయారీదారుడు ఎం.డీ జహంగీర్ పాష అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జహంగీర్ ను విచారణ నిమిత్తం ఘాట్కేసర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Kalingaraju: కళింగరాజు ఫస్ట్ లుక్ రిలీజ్.. ఊరమాస్ లుక్ లో ఆశిష్..