పోలీసులకు చిక్కిన నకిలీ ఖాకీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డీస్పీ స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయట పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SOT పోలీసుల పేరుతో గత కొంతకాలంగా స్థానికులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఓ బ్యూటీ పార్లర్ సిబ్బందిని బెదిరించడంతో వీరి గుట్టురట్టయింది. ఈనెల 11వ తేదీన కేపీహెచ్‌బీలోని 6వ ఫేజ్‌లోని బోధా బ్యూటీ పార్లర్‌లోకి SOT పోలీసుల పేరుతో ముగ్గురు ఎంటరయ్యారు. గంప సాయిహర్ష, కావెల అభిలాష్‌గౌడ్, రంగభాను ప్రసాద్‌గౌడ్‌లు తమను తాము SOT పోలీసులమని చెప్పుకున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారు. అయితే వీరిపై అనుమానం వచ్చిన బ్యూటీ పార్లర్ మేనేజర్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభిలాష్‌గౌడ్, భానుప్రసాద్‌గౌడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నకిలీ పోలీస్ సాయిహర్ష కోసం గాలిస్తున్నారు.
Also Read
ఇప్పటికే డిఎస్‌పి అవతారమెత్తిన ఫేక్ పోలీస్ నెల్లూరు స్వామిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఖాకీ డ్రెస్‌పై మోజు పెంచుకున్న నెల్లూరు స్వామి.. ఎలాగైనా ఆ డ్రెస్‌లోనే ఉండాలని కలలు కని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎస్సై కాకపోయే సరికి.. నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. అందుకోసం అచ్చం పోలీస్ మాదిరిగానే ఖాకీ యూనిఫామ్‌ను కుట్టించుకున్నాడు. తర్వాత పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులతో తాను కూడా పోలీస్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ రోడ్డుపై హల్‌చేశాడు. అంతేకాదు ఉద్యోగం ఇప్పిస్తానని కొందరు అమాయకుల దగ్గరి నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు నెల్లూరు స్వామి. అటు సెటిల్‌మెంట్లకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ముగ్గురు నకిలీ పోలీసులు పట్టుబడటంతో ఇంకా ఎంత మంది ఫేక్ ఖాకీలు ఉన్నారో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారిని విచారిస్తున్నారు.
- Tags
- arrest
- Fake polices
- telangana
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!