సోషల్ మీడియాలో ఆగంతకులు రెచ్చిపోతున్నారు. దేవుడిని, గుళ్ళను, దేవతలను ఎవరినీ వదలడం లేదు. తాజాగా కేటుగాళ్ళు మరీ పేట్రేగిపోయారు. భద్రాచలంలోని రాములోరి గుడిని టార్గెట్ చేశారు. Bhadrachalam temple city ..భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అంతటితో ఆగకుండా మరీ రెచ్చిపోయారు.
పలు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు ఆగంతకులు. రెండురోజులుగా ఫేస్ బుక్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు రామభక్తులు. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. భద్రాచలం రామాలయం పేరు మీద ఫేస్ బుక్ లో ఎటువంటి అకౌంట్, యాప్ లు, సైట్ లు లేవన్నారు ఆలయ వర్గాలు. ఈ దుష్ప్రచారంపై ఏఎస్పీకి కంప్లైంట్ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పేరుతో ఫేస్ బుక్ లో ఐడి సృష్టించి రెండు రోజులుగా అశ్లీల పోస్టుల హల్చల్ చెయ్యటంతో భద్రాచలం ఎఎస్పీ రోహిత్ రాజ్ దృష్టికి తీసుకెళ్ళారు రామభక్తులు. ఎవరో ఆకతాయిల చేష్టలు అయి ఉండొచ్చని, వెంటనే ఆ అకౌంట్ నిలిపివేస్తామని తెలిపారు అధికారులు. ఈ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని, డబ్బులు పంపమన్నా పంపవద్దని అధికారులు సూచించారు.
