NTV Telugu Site icon

హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్…

హైదరాబాద్ షాద్ నగర్ లో ఓ నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. నేరుగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు వార్డ్ బాయ్. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నాడు అంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో 420,336 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు షాద్ నగర్ పోలీసులు. వివిధ ఫిర్యాదులతో షాద్ నగర్ అమ్మ హాస్పిటల్ ను సీజ్ చేసిన డిప్యూటీ DMHO ట్రీట్మెంట్ పేరుతో పలువురిని సీరియస్ స్టేజి కి తీసుకెళ్లాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. ENT డాక్టర్ M. ప్రవీణ్ కుమార్ పేరుతో లైసెన్స్ పొంది చలామణి అవుతున్నాడు. అనుభవం లేని వైద్యులను తీసుకొచ్చి ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటూ వైద్యం చెపిస్తున్నాడు నకిలీ డిక్టర్ ప్రవీణ్. గతంలో మహుబూబ్ నగర్ లో నవోదయ హాస్పిటల్ వార్డ్ బాయ్ గా పనిచేసాడు ఈ ఫేక్ డాక్టర్ ప్రవీణ్ కుమార్.