రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ దొంగల నుంచి 17 కోట్లు విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
Read: వైస్ ఛాన్సలర్ నియామకంపై స్పందించిన కరణం మల్లీశ్వరి