వైస్‌ ఛాన్సలర్‌ నియామకంపై స్పందించిన కరణం మల్లీశ్వరి

ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా నియామకం కావడంపై స్పందించారు కరణం మల్లీశ్వరి “ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ” తొలి వైస్‌ ఛాన్సలర్‌గా నియామకంపై ఆనందంగా ఉందని.. ఇంకా భవన నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ 10 పదేళ్లలో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి గుర్తింపు తీసుకుచ్చే మంచి క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయం నుంచి తయారయ్యేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. దేశంలో రెండు, మూడు దశాబ్దాల క్రితం కంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే మౌలిక సౌకర్యాలు ప్రస్తుతం బాగా పెరిగాయని.. అయునా, ఐరోపా దేశాలతో పోటీపడే స్థాయిలో ఇంకా ఏర్పాట్లు పెంచుకోవాల్సి ఉందని ఆమె వెల్లండిచారు. ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అకాడమీ ఏర్పాటుచేసి సుమారు 300 మందికి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నా పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా అయిన తెలుగు ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేయాలనే కోరిక ఉందని తెలిపారు. ఏపిలో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం “వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ” ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు కానీ, అమలు చేయలేదని వెల్లడించారు. ఇప్పటి ఏపి ప్రభుత్వాన్ని నేను సంప్రదించలేదని… అయితే, అడగకుండానే ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వమే అండగా ఉంటే, సహాయం చేస్తే, అకాడమీ ఏర్పాటు చేసి, మంచి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పం బలంగా ఉందన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-