NTV Telugu Site icon

Telangana DGP: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణ డీజీపీ పేరుతో ఫేక్ కాల్

Telagana Dgp

Telagana Dgp

Telangana DGP: ఇటీవలి కాలంలో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. మాయమాటలతో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవైసీ అప్ డేట్, బహుమతులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఓఎల్ ఎక్స్, లాటరీల పేరుతో మోసం చేసిన సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసానికి తెరలేపేపారు. తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన కలకలం రేపుతుంది.

హైదరాబాద్ లోని పాత బస్తి చెందిన ఓ యువకుడికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే అందులో డీజేపీ ఫోటోతో కాల్ రావడంతో యువకుడు బెంబేలెత్తి పోయాదు. తనకు డీజీపీ నుంచి ఫోన్ రావడంత ఏంటని కాల్ రిసీవ్ చేసి మాట్లాడాడు. అయితే అందులో అచ్చం డీజీపీ వాయిస్ లాగే ఉండటంతో సార్ చెప్పండి అంటూ ఆ యువకుడు మట్లాడాడు. అయితే.. ఆ యువకుడిని బెదిరించడం స్టార్ట్ చేశాడు. మీ బావమరిదిని డ్రగ్స్ తో పట్టుకున్నామని, అతని నీ నెంబర్ ఇచ్చాడని తెలిపారు. అందుకే నీకు ఫోన్ చేశామన్నారు. అయితే ఆ యువకుడు నిజమే అనుకుని అదేంటి సార్ మా బావమరిది డ్రగ్స్ తో దొరకడం ఏంటి ? అని ప్రశ్నించగా అదేమీ మాకు తెలియదు.

Read also: Kalki 2898 AD : ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ట్రైలర్ వచ్చేస్తుంది..

నిర్లక్ష్యం చేస్తే నీ బావమరిదిని జైలుకు పంపాల్సి ఉంటుందన్నారు. బావమరిది మీ కుంటుంబానికి అప్పగించాలంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తే కేసు లేకుండా చూస్తామంటూ బెదిరించారు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదన్నారు. అయితే ఆన్లైన్ అంటూనే ఆయువకుడికి అనుమానం వచ్చింది. డీజీపీ అయితే పోలీసులకు నా దగ్గరకు పంపుతామంటారు. అంతేకానీ ఆన్ లైన పేమెంట్ చేయమంటున్నాడు ఏంటని కాసేపు ప్రశ్నలు కదలాయి ఆ యువకుడికి దీంతో కాల్ ను మళ్లీ చూడగా పాకిస్తాన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఇదంతా సైబర్ కేటుగాళ్లు పనేనని పసిగట్టాడు.

వెంటనే ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ యువకుడి వద్దకు చేరుకుని ఫోన్ తీసుకుని పరీశీలించగా ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. ఈ యువకుడికి వచ్చిన పోన్ నెంబర్ సహాయంతో ఆ.. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తాన్నారు. సైబర్ కేటుగాళ్లు తెలంగాణ డీజీపీ ఫోటోతో సహా ఆయన పేరును కూడా వాడుకోవడం నగరంలో సంచలనంగా మారింది. ఈ కేసు పోలీసులకే సవాల్ మారింది.

YSRCP: వైసీపీకి నెల్లూరు మేయర్ రాజీనామా!

Show comments