Site icon NTV Telugu

Rajanna Sircilla: ఉద్యోగాల పేరుతో ప్రకటన.. కోట్లు కొట్టేసిన కేటుగాడు

Fack Jobs

Fack Jobs

Rajanna Sircilla: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడిన కొందరు మోసగాళ్లు వివిధ మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా.. ఉద్యోగాల పేరుతో ఓ కేటుగాడు భారీ మోసానికి తెరతీశాడు. దేశవ్యాప్తంగా 1300 మందిని రూ. 1.6 కోట్లు కొల్లగొట్టాడు. ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇస్తున్నాడు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా వర్కర్ ఉద్యోగాల కోసం పేపర్‌లో ప్రకటనలు వచ్చాయి. అది నమ్మిన రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళ అతడిని సంప్రదించింది. ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు చెల్లించాలని నమ్మించాడు. బాధితుడు నమ్మి రూ. 3 లక్షలు ఖాతా ద్వారా బదిలీ చేశారు. ఆ తర్వాత నిందితుడు పంపిన లింక్‌పై రెజ్యూమ్‌ను షేర్ చేయాలని కోరాడు. ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ ఐడీలతో ఆమెకు ఈ మెయిల్స్ పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు రామ్‌ప్రసాద్‌ను అరెస్టు చేశారు. అతడికి సిమ్ కార్డులు అందించిన మరో నిందితుడు రామ్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసి రామ్ ప్రసాద్ ఇప్పటి వరకు 1.6 కోట్లు దోచుకున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు. అతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 65 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహాజన్ సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు.
Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్‌ హెడ్‌తో బోగస్‌ సిఫార్స్‌ లేఖ

Exit mobile version