Telangana schools: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. ఈ హాజరు విధానం ద్వారా విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలనేది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది. దాదాపు ఏడాది క్రితమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా కనీసం 40 శాతం పాఠశాలల్లో అమలు కావడం లేదు.
Read also: NTR: దేవర గ్లిమ్ప్స్ ముందున్న టార్గెట్ ఇదే… 24 గంటల్లో అన్ని లైకులా సాధ్యమేనా
ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో విద్యాశాఖ ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కాగా, ఈ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విధానం ఉండేది. ప్రతి నెలాఖరులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అయితే వారు పంపిన వివరాలు విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం, దుస్తులు, పుస్తకాలకు సరిపోవడం లేదని అధికారులు ఆరోపించారు. పాఠశాల నిర్వహణ నిధులు కూడా పక్కాగా లెక్కించలేని పరిస్థితి నెలకొంది.
AP Assembly Session: ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు.. ఎప్పుడంటే..?