NTV Telugu Site icon

Extreme Cold in Telangana: తెలంగాణపై చలి పంజా.. జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు

Cold Wave In Telangana

Cold Wave In Telangana

Extreme Cold in Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలికి పులి పంజా విసరడంతో జనం వణికిపోతున్నారు. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులతో పాటు గాలిలో తేమశాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తోందన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పట్టణాలు, పల్లెల్లో రోడ్లన్నీ దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. అయితే.. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read also: Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..

ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, వరంగల్‌, హన్మకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, మల్కాజిగిరి జిల్లాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వాయువ్య దిశలో కొంత వేడి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్, మధ్య తెలంగాణలో కొంత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరుగుతోందని.. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఆస్తమాతో పాటు కొన్ని శ్వాసకోశ సమస్యలు వస్తాయని తెలిపారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు.
Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..

Show comments