NTV Telugu Site icon

బీజేపీ ఉత్తర భారత దేశ పార్టీ : వినోద్ కుమార్

నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ లో నిర్మల సీతారామన్ చెప్పారని, రాష్ట్రాల తో సంబంధం లేకుండా ఆమె ప్రకటించారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు కానీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు జారీ చేస్తుందని ఆయన అన్నారు.
వాజపేయి ప్రధాని గా ఉండగా రాజ్యాంగం పై సమీక్ష కు 11 మందితో కమిటీ వేసింది. వెంకటచలయ్యా కమిషన్ వేసింది.. గోదావరి నది జలాలను కావేరి లోకి ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని కొన్ని సబ్జెక్టులకే ప్రధాని.. అన్నింటిలో వేలు పెట్టడానికి లేదని ఆయన అన్నారు.

కేసీఆర్ కొత్తగా చెప్పింది ఏమి లేదని, బీజేపీ మాటలు నమ్మొద్దు… రెచ్చగొట్టే మాటలను లెక్క చేయొద్దని వినోద్ మాట్లాడారు. హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారు… హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. బీజేపీ ఉత్తర భారత దేశ పార్టీ అని వినోద్ వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం పై డీపీఆర్ తయారు ఆయిందని చెప్పడం బక్వాస్ అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాది లో పెడితే దేశం విచ్ఛిన్నం అవుతుందని గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ లు మేమే దరఖాస్తు లు వింటాం అని అంటున్నారని, గవర్నర్ మమత బెనర్జీ పై ట్వీట్ చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు.