Ex Mp Vs Mla Rega Kantharao: కత్తులు దూసుకుంటున్న టీఆర్ఎస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెల మడుగులో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణలు టీఆర్ఎస్ పార్టీలో గందరగోళానికి తావిస్తున్నాయి. పొంగులేటి తో సహా పొంగులేటి వర్గాన్ని పార్టీ నుంచి పంపించి వేస్తామని రేగా కాంతారావు అంటున్న పరిస్థితికి వచ్చింది. అశ్వాపురం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని గత రాత్రి ఆవిష్కరించడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు తో పాటుగా మాజీ ఎస్ సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యలు వచ్చారు. అయితే వారు వస్తున్న విషయాన్ని తమకు సమాచారం ఇవ్వలేదని ఎంఎల్ఎ , విప్ , టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయిన రేగా కాంతారావు ఆగ్రహంగా ఉన్నారు.
Also Read
- Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్‌లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
ప్రోటోకాల్ ప్రకారం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్న రేగా మండలంలో 144 సెక్షన్ ను విధించేలా చేశారు.అయితే పొంగులేటి బృందం మల్లెల మడుగు గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈసందర్బంగా పొంగులేటి బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పిడమర్తి రవి ఉద్యమ కాలంలో చేసినట్లుగానే మోటార్ బైక్ పై పోలీసుల కళ్లు గప్పి వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణలో రాళ్ల దాడితో పొంగులేటి వర్గానికి చెందిన వారు ఇద్దరు గాయపడ్డారు. దీంతో పోలీసులు పొంగులేటి వర్గానికి చెందిన రెండు సార్లు సత్తుపల్లి నుంచి ఎంఎల్ఎ గా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవిపై రెండు కేసులు నమోదు చేశారు.
ఇకపోతే ఈ వ్యవహారం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పొంగులేటి వర్గాన్ని దెబ్బ తీయడం కోసం దీనిని వినియోగంచుకోవాలని చూస్తున్నారు. రేగా కాంతారావు ఇది అవకాశంగా తీసుకుని పొంగులేటిని పార్టీ బయటకు పంపాలన్న ఎత్తుగడలు పన్నినట్లుగా తెలుస్తోంది. పొంగులేటి పై రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొంగులేటి పార్టీని వదలిపెట్టి, వేరే పార్టీలో చేరి పర్యటనలు చేపట్టాలని అంటున్నాడు. అంతేకాదు ఈ దాడి అంతా అగ్రవర్ణాలు చేసినట్లుగానే ఉందని, ఆర్ ఎస్ ఎస్ ఎటువంటి దాడులు చేస్తుందో అదే తరహా లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి దాడులు చేస్తున్నట్లుగా ఉందన్నారు రేగా కాంతారావు. ఈవ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుంచి పంపించే చర్యలను తీసుకుంటామని అంటున్నారు.
రేగా కాంతారావు పై మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు కూడా మండిపడుతున్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోచేరారని ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహిగా రేగా ఉన్నాడని ఆరోపించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని అంటున్నాడు. పినపాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాలు భగ్గు మంటున్నాయి. ఇటు పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లు రాజకీయాలకు దూరం చేయాలని రేగా కాంతారావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈనేపద్యంలో పాయంకు మద్దతు ఇస్తున్న పొంగులేటి పై కూడ విరుచుకుపడుతున్నారు. అయితే అటు రేగా కాంతారావు ఇటు పొంగులేటి వర్గీయులు ఇద్దరు వ్యవహారాన్ని కేసీఆర్ కేటీఆర్ వద్ద తేల్చుకుంటామని అంటున్నారు.
మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎం.ఎల్ ఏ పాయం వెంకేటేశ్వర్ రావు, మాజీ ఎస్ సి కార్పొరేషన్ ఛైర్మెన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య తో పాటు 15 మంది టీఆరెస్ కార్యకర్తల పై అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. శుక్రవారం అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో జరిగిన గొడవ నేపథ్యంలో రెండు కేసులు నమోదయ్యాయి. పొంగులేటి వర్సెస్ రేగా కాంతారావు వర్గాల మధ్య వివాదం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Smart Ration Cards : గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!