NTV Telugu Site icon

Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్‌ రెడ్డి సీరియస్‌

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadish Reddy: విద్యుత్ కొనుగోళ్లలో నష్టం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనూ ప్రస్తుత ప్రభుత్వ నాయకులు అభ్యంతరాలు చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజే తమ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగారు. గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. విచారణ చేపట్టకముందే కమిషన్ తీర్పు చెప్పినట్లు వ్యవహరించిందని సీరియస్ అయింది. జస్టిస్ నరసింహారెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. కమిషన్ చైర్మన్ కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఏ కమీషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించదని చెప్పారు. కమిషన్‌ను, విచారణను తాము వ్యతిరేకించడం లేదన్నారు. గతంలో కమీషన్లు రాకుండా అడ్డుకున్న ఘటనలు ఉన్నాయన్నారు.

Read also: Traffic Restrictions: అల‌ర్ట్‌… రేపు న‌గ‌రంలో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..

కాగా.. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్‌ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉందని, ఇది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటిస్ జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిషన్‌కు 12 పేజీల లేఖ కేసీఆర్‌ రాశారు.
Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్‌.. వివరాలు ఇవే..

Show comments