KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ పోతే హరీష్ రావు లైన్ మెన్ లతో మాట్లాడి అపుతున్నాడు అని సీఎం అంటున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యా…హరీష్ రావు ఆ… అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అధ్బుతమైన పథకాలు ఉండేవి.. వాటిని కొనసాగించడం లేదని తెలిపారు. కల్లు గీత కార్మికుల ను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేయట్లేదన్నారు. అనవసరంగా కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఓడగుట్టుకున్నాం అని జనాలు అనుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం అయినప్పుడు అది బాంబు లాగా పేలుతుందన్నారు. అది ఎన్నో రోజులు కూడా లేదన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ గెలిచామన్నారు.
Read also: Telangana Rains: నేడు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు..
ఇంకో ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మనకు 11 వస్తాయి అని ఒకరు, 1 వస్తుంది అని మరొక సర్వేలు చెబుతున్నాయన్నారు. ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు.. ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచామని తెలిపారు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కుదుట పడింది.. ఇక జనాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సీఎంకి బుద్ధి ఉంటే కరెంట్ వాళ్లకు చెప్పాలి.. మొన్నటి వరకు కరెంట్ ఎలా వచ్చింది.. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడగాలన్నారు. ఈ ఆరు నెలల కాలంలో ఒక్క పాలసీ కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. మేము మొదటి క్యాబినెట్ లోనే 42 నిర్ణయాలు తీసుకున్నాము అంటున్నారని తెలిపారు. ముందు రోజుల్లో ఉజ్వల మైన భవిష్యత్ మనకు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 27 న ఎన్నికల కోడ్ ఉండడం తో పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకోలేదన్నారు. త్వరలో రెండు రోజుల పాటు పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకుందామన్నారు.
West Bengal: తమ కార్యకర్తలపై టీఎంసీ, సీపీఎం దాడికి పాల్పడింది.. బీజేపీ ఆరోపణ