NTV Telugu Site icon

UPSC Civils: కొనసాగుతున్న యూపీఎస్‌సీ సివిల్స్ 2024 ప్రాథ‌మిక‌ ప‌రీక్ష..!

Upsc Civils Exams

Upsc Civils Exams

UPSC Civils: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ పరీక్షను ఈరోజు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. వీటితోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘నో ఐడీ… నో ఎంట్రీ’ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హాల్ టికెట్, ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాబట్టి, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఐడి కార్డులను తమ వెంట తీసుకెళ్లాలి.

Read also: Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు

అలాగే ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. రెండు పేపర్ల పరీక్షకు 30 నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫోటో చెల్లుబాటు కాని వారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలి.
Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల సె** సామర్థ్యం తగ్గుతుందా?

Show comments