NTV Telugu Site icon

Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు

Indrakaran Reddy Allola

Indrakaran Reddy Allola

Celebrations of Lord Venkateswara Swamy: నేటి నుండి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అక్టోబరు 11 (నేటి) నుండి 15వ తేదీ వరకు అయిదు రోజుల పాటు హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో అంకురార్పణ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి పూజలు చేశారు. అనంతరం కపిల గోవుల దర్శనం చేసుకున్నారు. తదనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వర స్వామికి జ‌రిగే నిత్య, వార‌ సేవ‌లు, ఉత్సవాల‌ను చూసే అవ‌కాశం ద‌క్కని ల‌క్షలాది మంది భ‌క్తులకు వైభ‌వోత్సవాల ద్వారా చూసి త‌రించే అవకాశం ల‌భిస్తుంద‌న్నారు.

Read also: Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్‌.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో

ఈ వైభవోత్సవాలను చూసి తరించడం ఒక అదృష్టం గా భావించొచ్చనన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వ్యయా ప్రయసాలతో, సమయం తో కూడినదని ఒక్కోక్క సారి దర్శనానికి ఎన్నో గంటల సమయం పడుతుందని సాక్షాత్తు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆ భగవంతుని తీసుకురావడం వల్ల ఎందరో భక్తులు చూసే స్వామి వారిని చూసే భాగ్యం కలుగుతుందన్నారు. తిరుమల లో స్వామి వారికి ప్రసాదాలు చేసి బృందాలు స్వయంగా ఇక్కడికి వచ్చాయన్నారు. 300 వరకు అర్చకులు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గత 6 సం. ల నుండి హైదరాబాద్ లో వైభవోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ వైభవోత్సవాలను హర్ష ఆటో గ్రూప్ ముప్పవరపు హర్షవర్ధన్, అపర్ణ గ్రూప్ ఎస్ ఎస్ రెడ్డి% శ్రీ సి. వెంకటేస్వర రెడ్డి, వంసిరామ్ బిల్డర్స్ బి.సుబ్బారెడ్డి లు 6 సం ల నుండి నిర్వహిస్తున్నారని వారికి స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. గతంలో వైభవోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినట్లు తెలిపారు. వైభవోత్సవాలను 10 వేల మంది భక్తులు తిలకించేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం 5 రోజుల పూజ కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే

Show comments