Site icon NTV Telugu

ఈటల బృందానికి తప్పిన ప్రమాదం..

ఈటల బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల రాజేందర్  ఢిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్యను గుర్తించిన ఫైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే ఈటల రాజేందర్ బృందం హైదరాబాద్ కు బయలు దేరింది. కాగా నిన్న ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే.

Exit mobile version