తెలంగాణ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవాంఛనీయం. ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వస్తె దాడులు చేస్తారా ? మీరు ఎలాగూ ఫామ్ హౌస్ దాటి బయటికిరారు. ప్రతిపక్ష నాయకులు వస్తే ఇలా దాడులు చేస్తారా? దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి భాద్యత వహించాలి. బీజేపీ కార్యకర్తల సంయమనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దు.’ అని ఆయన అన్నారు.
Etela Rajender : ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవాంఛనీయం
