Site icon NTV Telugu

Etela Rajender: కవిత విచారణ కుట్ర అయితే.. కోర్టు తేలుస్తుంది

Etela Rajender On Kavitha

Etela Rajender On Kavitha

Etela Rajender On Kavitha ED Investigation: కవిత విచారణ రాజకీయ కుట్ర అయితే, అది ఈ రాష్ట్రానికి చెందిన వారి మీదే విచారణ జరగాలని.. కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వాళ్ళను ఎందుకు విచారిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ లిక్కర్ స్కాంలో ఆరేడు రాష్ట్రాల రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నారు. ఒకవేళ కవిత విచారణ రాజకీయ కుట్రే అయితే.. ఆ విషయాన్ని కోర్టు తేలుస్తుందని అన్నారు. తప్పు చేస్తే నా కొడుకు అయినా, బిడ్డనైనా వదిలిపెట్టననని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారని.. మరి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

Man Killed Son-in-Law: కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. అల్లుడిని నడిరోడ్డుపై..

రాజకీయపరమైన వేధింపులంటూ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహస్యం చేసే విధంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సంపాదన సరిపోదు అన్నట్టుగా.. కుటుంబ పాలనలో కేసీఆర్ ఢిల్లీదాకా ఎగబాకారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి.. దేశవ్యాప్తంగా విస్తరిద్దామని కేసీఆర్ అనుకుంటున్నారా? అని అడిగారు. రాజకీయపరంగా వేధింపులకు పాల్పడితే.. ఆ కేసు కోర్టులో నిలవదన్నారు. తప్పు చేశారా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని, చట్టం మీద తమకు సంపూర్ణ నమ్మకం ఉందని అన్నారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. అబద్ధాలను కూడా ప్రజల్ని నమ్మించేలా కేసీఆర్ చెప్పగలని వ్యాఖ్యానించారు. ‘మీరు దాచుకొండి దోచుకొండి.. మీకు ఆపద వచ్చినప్పుడు మీకు అండగా ఉంటాం’ అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏమైనా రాసి ఇచ్చారు? అని ప్రశ్నించారు.

Madhu Goud Yaskhi: కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలి

తెలంగాణ రాష్ట్ర అడిషనల్ ఎడ్వకెట్ జనరల్‌తో పాటు మంత్రులు సైతం కవిత వెంబడి ఎలా పోతున్నారని.. లిక్కర్ స్కాంకి, వారికి ఏంటి సంబంధమని ఈటల రాజేందర్ నిలదీశారు. ‘‘అసలు ఇది మహిళలు చేసే బిజినెస్సేనా? లిక్కర్ స్కాంలో ఆడవాళ్ళు ఉంటారా?’’ అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారన్నారు. ‘‘బిజినెస్ చేసుకోవడానికి ఇదే దొరికిందా? మహిళగా ఇది ఒక కళంకం’’ అని పేర్కొన్నారు. చట్టానికి సహకరించి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. దారిలో పోయే దానయ్య కంప్లైంట్ చేస్తే తనని తీసేశారని.. కనీసం విచారణ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కోడనికి ఎందుకు వెనక్కు పోతున్నారని ప్రశ్నించారు.

Exit mobile version