BJP MLA Etela Rajender Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మాక్ పోలింగ్ అనంతరం నిర్వహించిన మీడియా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరదల వెనుకు విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ కు ఈటల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లు ఉందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే ఒక అర్థం ఉండాలని, వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే.. వర్షాలను కురిపించి అక్కడి ప్రజలను చంపుకోదు కదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కరువు ఏర్పడిన సమయంలో మేఘమథనం చేస్తేనే వర్షాలు పడలేదని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే రాజ్యాంగబద్ధంగా వస్తాయనుకున్న రిజర్వేషన్లను కేసీఆర్ ఇవ్వలేదని, గొప్ప దార్శనీకత ప్రదర్శించి మోడీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కానీ ఇక్కడి పాలకులు అలా చేయడంలేదన్నారు. రాజ్యాధికారం వస్తే వారి బతుకులు బాగుపడుతాయని మోడీ ఆలోచన చేస్తుంటే.. ఇక్కడ మాత్ర గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారన్నారు. నిన్నటి టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో తెలంగాణకు కేంద్రం సహాయం చేయాలని కోరతారనుకున్నామని, కానీ గుడ్డి ద్వేషంతో ఆరోపణలు చేశారన్నారు.
ఎఫ్ఆర్ బీఎం చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుందని తెలియకపోవడం ఎలా? అని ఆయన అన్నారు. టాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ను రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులను ఆడిట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఖర్చు చేసే నిధుల వల్ల ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని, ముందు ముందు సోషల్ ఆడిట్ జరుగుతుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోడీ చేసినవేనని, గవర్నర్ వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తే అక్కడ మీ ఎస్పీ, కలెక్టర్ లేడు. ఇది గవర్నర్ ను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ఆమెను అవమానిస్తే.. యావత్ తెలంగాణను అవమానించినట్లేనని ఆయన ధ్వజమెత్తారు. అ