Site icon NTV Telugu

Etela Rajender Letter To DCP: ఇవాల రాలేను.. సోమవారం హాజరవుతా

Etala Rajender

Etala Rajender

Etela Rajender Letter To DCP: టెన్త్ తరగతి హిందీ పేపర్ లీకేజీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ నాయకుల మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో బండిసంజయ్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, పలు షరతులతో బెయిల్‌పై బండిసంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. అయితే కోశ్చన్ పేపర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాట్సాప్ ద్వారా చేరిందని పోలీసులు చెబుతున్నారు. ఈ అంశంపై నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా పూడూరు ఓఆర్‌ఆర్‌ సమీపంలోని ఈటల రాజేందర్‌ నివాసానికి నోటీసులు అందించారు.

Read also: Manish Sisodia: ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలి.. జైలు నుంచి మోడీకి సిసోడియా లేఖ

విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పీఏలు రాజు, నరేందర్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంపై ఈటల రాజేందర్ స్పందించి డీజీపీకి లేఖ రాశారు. నోటీసులు అందాయని, ఇవాళ రాలేనని, ముందస్తు షెడ్యూల్ ప్రకారం హాజరు కాలేనని పేర్కొన్నారు. 10వ తేదీ (సోమవారం) విచారణకు హాజరవుతామన్నారు. తనకు వాట్సాప్ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని ఈటల రాజేందర్ పదే పదే చెబుతున్నాని తెలిపారు. తనకు ఫోన్ వస్తేనే ఎవరితోనైనా మాట్లాడతానని చెప్పారు. వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయనని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో కూడా ప్రస్తావించారు. ఈటల రాజేందర్‌కు కూడా పేపర్ దొరికిందని… విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Today Business Headlines 07-04-23: ‘సచిన్ టెండుల్కర్’కి తనిష్క్ కానుక. మరిన్ని వార్తలు

Exit mobile version