NTV Telugu Site icon

మళ్లీ తెరపైకి ఈటల భూ వ్యవహారం.. నోటీసులు జారీ

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్‌ సంస్థకు.. డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు. మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.

జమున హెచరీస్‌తోపాటు 200 మంది రైతులు, పరిశ్రమ వ్యాపారులు.. సర్వేకు సహకరించాలని నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్‌ వెల్లడించారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో భూసర్వే ఉంటుందని చెప్పారు. జమున హేచరీస్‌ అధీనంలో సీలింగ్ లాండ్, అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉందనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే కొనసాగుతుంది. కాగా, భూ వ్యవహారంతోనే ఈటల రాజేందర్‌ మంత్రి పదవి కోల్పోవడం.. ఆ తర్వాత ఈటల టీఆర్‌ఎస్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌ ఉప ఎన్నికలు అనివార్యం కావడం.. ఈ ఎన్నికల్లో ఈటల విజయం సాధించిన విషయం తెలిసిందే.