NTV Telugu Site icon

Etela Rajender: కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదు..

Etala Rajender

Etala Rajender

Etela Rajender: కిషన్ రెడ్డికి మతం, కులం, రంగు లేదు.. ఆయనకు మనుషులు మాత్రమే తెలుసని మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎంపీ లక్షణ్, ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా నేను కిషన్ రెడ్డి ఇద్దరం గెలిచామన్నారు. 2019లో ఆయన తప్పిపోయాడు.. నేను మొన్న తప్పిపోయా అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలను భుజం మీద పెట్టుకుని నడిపిస్తున్నాడు కిషన్ రెడ్డి అని తెలిపారు.

Read also: Israel attack on Iran : ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎవరు బలవంతులో తెలుసా ?

కిషన్ రెడ్డికి మతం కులం రంగు లేదు.. ఆయనకు మనుషులు మాత్రమే తెలుసన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం కష్టపడుతాడని తెలిపారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు ప్రజా సమస్యల మీద లెటర్స్ ఇచ్చే వాడని తెలిపారు. కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నానని ఈటల పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి రావడం నరేంద్ర మోడీ కృషికి నిదర్శనమని అన్నారు. ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే ప్రపంచంలోనే మూడో స్థానానికి వస్తుందని స్పష్టం చేశారు. గతంలో భారతదేశాన్ని పట్టించుకునే వారు లేరు. కానీ నేడు ప్రపంచం మొత్తం మోడీ వైపు చూస్తోందని, దేశాల మధ్య యుద్ధాల నివారణకు కూడా మన మోడీని ఆశ్రయించడం మన భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు.
Manchu Lakshmi : కారులో ఆ పోజులేంటి లక్ష్మక్క.. కిల్లింగ్ లుక్ లో లేటెస్ట్ స్టిల్స్ ..