Site icon NTV Telugu

ఈటల గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది…

etela rajender

etela rajender

జమ్మికుంట పట్టణంలో వడ్డెర సంఘం గర్జన మీటింగ్ కు ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎన్ని బెదిరింపులు చేసిన లొంగని జాతి వడ్డెర జాతి. కేసులు పెట్టుకోండి, జెసిబి లు సీజ్ చేసుకోండి కానీ తెరాసా జెండా కప్పుకొనేది లేదని చెప్పారు. దళితులకు అందరికీ దళితబంధు అందించాలి అని, అన్నీ కులాలలో ఉన్న పేద వారికి 10 లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నఅన్నారు. దళిత బంధు వద్దు అని నేను లెటర్ రాసి నట్టు దొంగ లెటర్ పుట్టించిండు కేసీఆర్. వాళ్ళ మీటింగ్స్ కు పస లేదు, మన మీటింగ్ లో  హారతులు పడుతున్నారు అని… నేను రాజేందర్ గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారి పోతుంది అని ఈటల తెలిపారు.

ఇక అణగారిన వర్గాలకు గొంతుక ఈ ఈటల అని చెప్పిన ఆయన పేద వర్గాలకు చెందిన వారు రాజకీయాల్లోకి రాకుండా డబ్బు మయం చేశాడు కేసీఆర్. అక్రమంగా సంపాదించుకున్న కాళేశ్వరం డబ్బులు తీసుకు వచ్చి ఓటు కి 20 వేలు ఇస్తారట కేసీఆర్. మన జీవితాలను, మన తల రాతలను మార్చే ఎన్నిక ఇది. అశామషీగా తీసుకోవద్దు. మీ హక్కుల కోసం పోరాడే భాధ్యత నాది అని పేర్కొన్నారు.

Exit mobile version