Site icon NTV Telugu

Etela Rajender : ప్రజలు అసహ్యించుకుంటున్న నాయకుడు కేసీఆర్‌

Etela

Etela

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలో కొనసాగుతుందని ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్‌ అంటే గౌరవం ఉండేది. ఆయన మాటలపై ఒకప్పుడు నమ్మకం ఉండేదని, కానీ.. ఇవాళ తెలంగాణ గడ్డమీద ప్రజల చేత అస్యహించుకోబడ్డ నాయకుడు కేసీఆర్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ సమస్య, రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతుందనుకున్నామన్నారు. కానీ.. తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారన్నారు. తన వైఫల్యాలను, తన ఓటమిలను ఇతర పార్టీలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కు త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

Exit mobile version