Site icon NTV Telugu

హరీష్ రావు కు ఈటల రాజేందర్ కౌంటర్.. చర్చకు సిద్ధమా!

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హరీష్‌ రావు చేసిన విమర్శలపై అబిడ్స్ లో చర్చకు సిద్దమని..ఎవరిది తప్పు ఐతే వారికి శిక్ష పడుతుందని చురకలు అంటించారు. నా ఆస్తులపై విచారణకు రెడీ అని… సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ చేద్దామని సవాల్‌ విసిరారు. పార్టీలో చేరినపుడు ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తెలుద్దామని.. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను అభివృద్ది చేయలేదు అంటున్నారని.. నిన్న హరీష్‌ రావు తిరిగిన రోడ్లు తాను వేపించినవేనని స్పష్టం చేశారు.

Exit mobile version