Site icon NTV Telugu

2023 ఎన్నికలకు ముందు ఈ ఎన్నిక రిహార్సల్ : ఈటల

etela rajender

etela rajender

జమ్మికుంట లో బీజేపీ రైతు కిషన్ మోర్ఛ రెడ్డి సభ కు హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… హుజురాబాద్ గడ్డ మీద కేసీఆర్ కు డిపాజిట్ వస్తే నేను బాధ్యత వహిస్తా. చక్రవర్తులు, రాజుల చరిత్ర గురించి మన అందరికి తెలుసు. కానీ ఈ రాజు చరిత్ర నీచమైన చరిత్ర. ఉద్యమ సమయంలో నేను సంపాదించి ఇచ్చిన డబ్బు కాదా అని అడిగారు. ఒకప్పుడు నా ఆస్తీ ఎంత, కేసీఆర్ ఆస్తీ ఎంత లెక్కలు తీయాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్ముకున్నది ఎవరో చెప్పాలి. కేసీఆర్ నియంత పాలన అంతం చేసేందుకు మన అందరం ముందు అడుగు వేయాలి. రాజేందర్ గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటున్నారు. నీ ముఖం చెళ్లక నా పేరు చెప్పుకుంటున్నావు. అయితే 2023 ఎన్నికలకు జస్ట్ ఈ ఎన్నిక రిహార్సల్ లాంటింది అని చెప్పిన ఈటల 2023లో తెలంగాణ లో ఎగిరేది కాషాయ జెండా అని పేర్కొన్నారు.

Exit mobile version