Etela Rajender Challenges CM KCR Over 24 Hours Power: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందని నిరూపిస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని ఛాలెంజ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారి, భూములు అమ్ముకుంటోందని ఆరోపణలు చేశారు. ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్స్ కట్టిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంతవరకు పేదలకు గానీ, రైతులకు గానీ ఇళ్ల జాగాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌తో ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. దేశంలోనే ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పింఛన్లు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఎక్కడా పోవని, ఇంకా పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే మన పిల్లల బతుకులు బాగు పడతాయని అన్నారు.
Bandi Sanjay: పువ్వు గుర్తు పేదోళ్లకైతే, కారు గుర్తు పెద్దోళ్ల కోసం
అంతకుముందు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇంకా కొనసాగడం రాష్ట్రానికి అరిష్టమని విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేకుండా పోయిందని.. అణగారిన వర్గాలు, మహిళలను అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ రైతు బందు పేరుతో డబ్బిలిచ్చి, ధాన్యం తరుగు పేరిట నిలువునా దోచుకుంటున్నారని అన్నారు. ‘‘దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ అంటున్నాడు.. ఎందులో తెలుసా? ఏ రాష్ట్రానికి లేని లిక్కర్ ఆదాయంలో నెంబర్ వన్’’ అంటూ వ్యాఖ్యానించారు. 2018లో 70 లక్షల మహిళా ఓట్ల కోసం మహిళ సంఘాలకు వడ్డీ మాఫీ ఇస్తే.. ఇప్పటివరకు మాఫీ కాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకపక్క కల్యాణ లక్ష్మితో పెళ్లిళ్లు చేస్తూనే.. మరోపక్క లిక్కర్ తాగించి పుస్తెలతాడు తెంపుతోందని అన్నారు. మోటార్ల కరెంట్ బిల్లు లేక రైతుల నుండి ఏసీడీ పేర వసూల్ చేస్తున్నారని పేర్కొన్నారు.
Tollywood: ‘దిల్’ రాజు, సి. కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా!?