NTV Telugu Site icon

Etala Rajender: మేము ఫైటర్లమే.. బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు..

Etala Rajender

Etala Rajender

Etala Rajender: బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లమే అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ ఆక్రమణదారుల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులకు పాల్పడితే భయపడబోం.. మేం పోరాటయోధులమన్నారు. ప్రజల పక్షాన నిలబడతాం. మల్లన్న సాగర్‌ భూమిని చెట్టుకొమ్మలాగా కాజేసిన వారే నాపై పోటీ చేసే ధైర్యం లేక బీజేపీ పోళ్లను రానివ్వొద్దు అంటున్నారు.

అయితే.. మీకు బాధ ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని కోరారు. కాగా.. ప్రభుత్వ విలువ ప్రకారం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తుంటే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని నేను అన్నా.. అయినా నా మాట వినలేదని అన్నారు. అంతే కాకుండా.. భూ నిర్వాతులకు భూములను దూరం చేసి వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వారు దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నోల్లు ఎప్పటికీ బాగుపడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి నాలుగు సిలిండర్‌లు ఉచితంగా అధిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా కళ్యాణ లక్ష్మీ లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతామన్నారు. ఇక.. రూ.2100 ఉన్న వడ్లకి రూ.3100లకు పెంచుతూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తాని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Read also: Sandra Venkata Veeraiah: పార్టీలు మారి ఇయ్యాల డైలాగులు కొడుతున్నారు.. తుమ్మల పై సండ్ర ఫైర్….

కేసీఆర్ కు మరోసారి అవకాశం ఇస్తే ఎప్పటిలాగానే ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లకే పరిమితమవుతారని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్న ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్నారు. కాంగ్రెస్‌ను నాశనం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదు. దళిత ముఖ్యమంత్రి రేషన్‌కార్డులు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
Allu Arjun: అర్హాకి బన్నీ స్పెషల్ బర్త్ డే విషెష్…

Show comments