టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ధనవంతులు, బ్రోకర్లు, వందల ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతాడని ఆగ్రహించారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే పట్టాలు ఇవ్వలేని కేసీఆర్… డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమిస్తాడని ప్రశ్నించారు ఈటల. తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.
