Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో 45 ఎకరాల మిస్సింగ్
- కేసీఆర్ కుటుంబానికి రెవెన్యూ రికార్డులపై నోటీసులు
- అర్హులైన పేద రైతులకు భూముల పంపిణీకి నిర్ణయం
- అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, దాని శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల అధికారులు నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే నంబర్లో మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తక్షణమే తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ల్యాండ్ రికార్డులను పక్కాగా సరిచూసి భూమిని గుర్తించడం కోసం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబానికి నోటీసులు.. అర్హులైన రైతులకు భూముల పంపిణీ
మిస్సయిన భూమి సరిహద్దుల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్నందున, వారికి సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరుతూ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రికార్డులు పరిశీలించి, భూ సరిహద్దులను లెక్క తేల్చనున్నారు. కాగా, సర్వే నంబర్ 325 పరిధిలో గుర్తింపు పొందే సరిహద్దు భూమిని స్థానికంగా ఉన్న అర్హులైన పేద రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Also Read
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
తెలంగాణ అమరవీరుల కాలనీగా నిర్మాణం.. హౌసింగ్ బోర్డుకు బాధ్యతలు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల కోసం అదే సర్వే నంబర్ 325లో ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు, సకల మౌలిక వసతులతో సమగ్ర రూపురేఖలు దిద్దాలని సూచించారు. ఈ కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించిన సీఎం, వచ్చే జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!