NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: కోతుల బాధ్యత నాది.. భారీ మెజార్టీతో గెలిపించండి..

Errabelli

Errabelli

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు దూకుడు పెంచారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కాకుండా తన సొంత ఖర్చులతో ఒక మంచి స్కీం ఏర్పాటు చేశాను అని తెలిపారు. గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వలన పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో తనకు ఎక్కువ మెజారిటీ ఇచ్చిన గ్రామాలలో కోతుల బెడద లేకుండా చేస్తాను అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Read Also: Chain Snatcher: అప్పులు భరించలేక.. చైన్ స్నాచర్‌గా మారిన జాతీయ స్థాయి క్రీడాకారుడు

పాలకుర్తి నియోజకవర్గంలో పట్టుకున్న కోతులను తీసుకుపోయి.. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 1000 ఎకరాలలో పండ్ల తోటలు ఏర్పాటు చేశాను.. అడవిలో వదిలేస్తానాని మళ్లీ గ్రామాలకు కోతులు వస్తే మళ్ళీ వాటిని అడవిలో వదిలేసిన స్కీమ్ ను ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. అడవిలో వదిలే కోతులు ఇప్పుడు మంచిగా లావు అయ్యాయని అక్కడ ఫోటోలు తీసి నాకు చూపించారని ఎర్రబెల్లి అన్నారు. నాకు మెజార్టీ రాలేదనుకో ఆ గ్రామంలో కోతులు అలాగే ఉంటాయని తన కొత్త స్కీంను ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.