NTV Telugu Site icon

Minister Errabelli: పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి..!

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

Minister Errabelli: పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్ర పురం,పెద్దతండా, చిప్పరాళ్ల బండ తండ, గ్రామాలలో ప్రచారంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి BRS పార్టీని ఆశీర్వదించాలని అన్నారు. తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాలలో ఇవ్వని కరెంటు తెలంగాణ బ్రోకర్ మాటలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ మాటలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలని వినొద్దు అని సూచించారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పాలకుర్తి లో ఎగిరిది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. రైతుల గోస తీర్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంట్ కూడా లేదని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అన్నారు.

సమైక్య పాలనలో వెనుకబడిన గిరిజన సంస్థల్లో సంస్కరణలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం, కంబాలకుంట తండాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాకముందు తండా పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలన్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లే తండా మహిళలు ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా తమ ఇళ్లకు నీటిని తెచ్చుకుంటున్నారు. విష జ్వరాలతో బాధపడుతున్న తాండా ప్రజలను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దశాబ్దాలుగా తమ రాష్ట్రం కోసం పోరాడినా కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హామీ మేరకు తాండాలను పంచాయతీలుగా మార్చి లంబాడీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజనులతో పాటు రేషన్ కార్డులు ఉన్న వారికి రూ.400లకే సన్న బియ్యం, సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎంగా కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం వరంగల్ జిల్లా మాజీ ఎంపీపీ కంజర ఐలయ్య రాయపర్తితోపాటు మరికొందరు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Ram Charan: రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి..?