Ram Charan: రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.. సాయి పల్లవి ఎంపిక చేసుకోనే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు.. ఇక ఆ సినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం, రొమాంటిక్ సీన్స్ కోసం అయితే అస్సలు ఒప్పుకోదు.. అలాంటి సినిమాలు ఎప్పుడూ చెయ్యనని చెప్పేసింది..
అలాంటి పాత్ర ఉన్న సూపర్ స్టార్ సినిమా అయిన రిజక్ట్ చేస్తుంది.. గతంలో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వస్తే మొదట ఓకే అనుకున్న కథ విని వెంటనే రిజెక్ట్ చేసింది.. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ సినిమాలో నటించనుందనే వార్త వైరల్ అవుతుంది..రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ గేమ్‌ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే చెర్రి హీరోగా నెక్ట్స్ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈసినిమాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముందు మృణాళ్ పేరు వినపడింది. ఆ తర్వాత జాన్వికపూర్ పేరు లైన్లోకొచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కాదు సాయిపల్లవి అని కొత్త వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
Also Read
ఈ సినిమా రూరల్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కావడంతో హీరోయిన్ గా సాయిపల్లవి అయితేనే బాగుంటందని బుచ్చిబాబు భావించాడట. సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.. గ్రామీణ అమ్మాయిగా కనిపించునుందనే టాక్.. పాత్రకు ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంటుంది..సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాదు త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాలో విజయసేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. మైత్రీమూవీమేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బానర్లపై నిర్మించనున్నారు.. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా గురించి కీలక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!