Errabelli Dayakar Rao Gives Checks To Warangal Farmers: గతేడాది వరంగల్‌లోని నర్సంపేట్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు మంత్రి దయాకర్ రావు నష్టపరిహారాన్ని అందించారు. నష్టపోయిన రైతులకు పరిహారం 8 కోట్ల 89 లక్షల 43 వేల 45 రుపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టం విషయంలో కేంద్రం చొరవ చూపించడం లేదని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.17 కోట్లకు పైగా నష్టపరిహారం ఇస్తున్నాం అన్నారు. 13,500 హెక్టార్‌కి మిర్చికి నష్ట పరిహారం ఇస్తున్నామని.. పెట్టుబడిలో పావు వంతు కూడా రావడం లేదని అన్నారు. ఇంతివ్వాలి, అంతివ్వాలి అని అడిగేవాళ్లు.. వాళ్ల రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కూడా అకాల వర్షాలు పడ్డాయని.. కానీ ఆయా రాష్ట్రల్లో ఇప్పటివరకూ సర్వేలు చేయలేదన్నారు. కానీ.. తెలంగాణలో ప్రాథమిక సర్వేలు పూర్తి చేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు.
Etela Rajender: కవిత విచారణ కుట్ర అయితే.. కోర్టు తేలుస్తుంది
లక్షా 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సర్వే రిపోర్ట్‌లో వచ్చింది.. 91 వేల మంది రైతులు నష్టపోయారని తేలినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా.. వరంగల్ జిల్లాలో రైతులకు ఎక్కవ నష్టం జరిగిందన్నారు. 28 వేల 500 ఎకరాల్లో పంట నష్టం కాగా.. 2600 మంది రైతులు నష్టపోయారన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ఎవ్వరు పూడ్చలేరన్నారు. పక్క పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతారు, ఇంకా ఏమోమో హంగామా సృష్టిస్తారని.. కానీ రైతులు అసలు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. విపక్షాలు తమ రాష్ట్రాల్లో ఏం చేశాయో తెలుసుకొని చెప్పాలని, ఇక్కడ ధర్నాలు చేయాలని చెప్పారు. అధికారులు రైతుల వద్దకే వస్తారని.. పూర్తిగా నష్టపోయిన పంట వివరాల్ని అందించాలని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకున్నా.. రైతుల కోసం సీఎం కేసీఆర్ రెండు, మూడు రోజుల్లో నర్సంపేట్‌కి వస్తున్నారన్నారు. స్వయంగా సీఎం ఈ ప్రాంతాల్లో పర్యటించడంతో.. ఇక్కడి రైతులకు ఎక్కవ లాభం జరుగుతుందని తెలియజేశారు.
SI Saved 16 Members Life: సెల్యూట్ ఎస్సై సార్.. 16 మంది ప్రాణాలు కాపాడారు..