Site icon NTV Telugu

Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

Errabelli: కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏమి మాట్లాడుతారో వాళ్ళకే తెలియదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 60 ఎండ్ల ముందు తెలంగాణ రాష్ట్ర ఎలా ఉంది.. కేసీఆర్ ఇచ్చిన తర్వాత తెలంగాణా రాష్ట్రం ఎలా ఉందని ప్రశ్నించారు. ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తోందని అన్నారు. అందుకే గతంలో మంత్రులు పర్యటన చేస్తే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పర్యటన చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏమి మాట్లాడుతారో వాళ్ళకే తెలువదని, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Read also: Gangula Kamalakar: త్వరలో సింగపూర్‌ తరహా కరీంనగర్‌ అభివృద్ధి

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం 5 వేలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మాత్రమే ఏకరకు 10 వేల నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు 1లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల గోదాములు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో చేసే పాలన దేశం మొత్తం కోరుతున్నారని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో కోరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 7 క్వింటాలు కొనుగోలు చేస్తుంది కానీ తెలంగాణలో మొత్తం వరిదాన్యం కొంటున్నదని తెలిపారు. తడిచిన ప్రతీ గింజను కేసీఆర్ కొనుగోలు చేయాలని ఆదేశించారు అమలు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ మాటలు ఎవ్వరూ నమ్మద్దని అన్నారు.
MLA Raja Singh: తలసానిపై బీజేపీ నేత రాజాసింగ్‌ ప్రశంసలు.. అయోమయంలో ప్రజలు

Exit mobile version