Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : కావాలనే కేంద్రం రా రైస్ అడుగుతోంది..

Errabelli

Errabelli

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ నేడు టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపత్యంలో వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చాము.. వడ్లు కొనలేమని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. యాసంగి వడ్లు కొనకుండా కేంద్రం నటకాలాడుతోందని, రైతులను వరి వేయండి, వడ్లు కొంటామని కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పారన్నారు.

తెలంగాణలో రా రైస్ రాదు, కావాలనే కేంద్రం రా రైస్ అడుగుతోందని ఆయన ఆరోపించారు. 3 వేల కోట్లు నష్టం జరిగినా రాష్ట్రం వడ్లు కొనడానికి సిద్ధం, కానీ వాటిని విదేశాలకు అమ్మాలంటే కేంద్రం సాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యాపారులకు బీజేపీ కొమ్ముకాస్తూ వ్యవసాయ చట్టాలు చేస్తే కేసీఆర్ వ్యతిరేకించారు… 700 మంది రైతులు మరణించాక బీజేపీ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. రైతులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రేపు బీజేపీ శవయాత్రలు చేయాలి, ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేయాలి. కేంద్రం తెలంగాణ రైతుల వడ్లు ఎలా కొనదో కేసీఆర్ చూసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version