Eravathri Anil Kumar Fires On Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి RSS అజెండాను అమలు చేస్తున్నారనే అనుమానం ఉందని మాజీ విప్ ఈరవర్తి అనిల్ కుమార్ అన్నారు. అద్దంకి నోరు జారితే.. క్షమాపణ చెప్పే వరకు కోమటరెడ్డి వెంటపడ్డారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు కోమటిరెడ్డి వ్యతిరేకి అని.. పార్టీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండొద్దా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఉంటుందని తాము నమ్ముతున్నామన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండని కోమటిరెడ్డి ప్రచారం చేశారని విమర్శించారు. ప్రియాంక గాంధీ దగ్గర స్రవంతికి టికెట్ ఇవ్వండని చెప్పి.. ఇక్కడ బీజేపీకి ప్రచారం చేసి, ప్రియాంక గాంధీని మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలుస్తుందని చెప్పి.. పార్టీకి నష్టం చేశారన్నారు. ఇన్ని తప్పులు చేసినా కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోలేదని.. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలకైతే వెంటనే నోటీసులు ఇస్తారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, భట్టి విక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు.
Shabbir Ali: సీఎం కేసీఆర్‌కి షబ్బీర్ అలీ లేఖ.. పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్
ఇదే సమయంలో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్దేశపూర్వకంగా మట్లాడుతున్నారని అన్నారు. బీసీ నాయకులంటే కోమటిరెడ్డికి చిన్నచూపు అని చెప్పారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ.. కోమటిరెడ్డిపై తప్పుడు మాటలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను పార్టీలో చేరడానికి ఏడాది వాయిదా పడింది కూడా కోమటిరెడ్డి వల్లేనని ఆరోపించారు.
Earthquake in Kurnool: కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు..