సిద్దిపేటలో రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ అధికారుల రాష్ట్రస్థాయి ఉన్నత అధికారుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ-ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్సీ జనరల్ మురళీధర్, ఈఎన్సీ ఇరిగేషన్ గజ్వేల్ హరిరామ్, ఈఎన్సీ ఇరిగేషన్ రామగుండం ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణ ఏర్పాటు అయ్యాక ప్రతి ఆయకట్టకు నీరు అందించామని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా జులై వరకు మరో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
గత ఏడాది నుండి ఇప్పటి వరకు చాలా మార్పులు చేసి ఒక్క ఎకరా కూడా ఎండీ పోకుండా సాగు నీరు అందిస్తామని, వర్ష కాలంలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన ద్వారా 3 కోట్ల టన్నుల పంటలు పండిస్తున్నామని, తెలంగాణలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన, ఇప్పుడు 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందేస్తు్న్నమన్నారు. రానున్న రోజుల్లో రెండు పంటలు సాగు అయ్యే విధంగా ఆలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.