Site icon NTV Telugu

పర్యాటక సంస్థ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి

పర్యాటక సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 180 మంది ఉద్యోగుల సర్వీ్‌సను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశామని సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యాటక అభివృద్ధి సంస్థలో ప్రస్తుతం కేవలం 80 మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులున్నారని, మిగిలినవారంతా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తామూ కీలకపాత్ర పోషించామని, స్వరాష్ట్రంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేయాల లేఖలో కోరారు.

Exit mobile version