NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఉద్రిక్తత..

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ముందు గేటుకు తాళం వేసి పోలీసులను లోనికి అనుమతించలేదు. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. గేటు తాళం పగులగొట్టి మహేశ్వరరెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహేశ్వర్ రెడ్డికి పోలీసులు సూచించగా, అందుకు నిరాకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మాస్టర్ ప్లాన్ జేవీ 220ని రద్దు చేసే వరకు దీక్ష విరమించేది లేదని మహేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో తెలిపారు.

Read also: Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అక్కడే.. హాజరుకానున్న అతిరథ మహారథులు!

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షలకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కిషన్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలిపారు. కొందరు నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడి మద్దతు తెలుపగా మరికొందరు ఫోన్‌లో పరామర్శించారు. ఆదివారం మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ్, ధర్మపురి అరవింద్ ప్రయత్నించి విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి తోడు ఎవరూ రాలేదు. మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు డీకే అరుణ, అరవింద్‌లను కూడా అనుమతించలేదు.

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిర్మల్‌లో బీజేపీ శ్రేణులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. బైల్‌బజార్‌ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుమిగూడారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మరోవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి ప్రతిగా ఈరోజు (సోమవారం) ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పోటాపోటీ రాజకీయ వ్యూహాలతో నిర్మల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Donald Trump: భారత్‎కు ట్రంప్ షాక్.. తాను అధ్యక్షుడైతే భారతీయ ఉత్పత్తులపై భారీ పన్ను