NTV Telugu Site icon

Munugode Bypoll: రేపు మునుగోడులో సెలవు..

Munugode Bypoll

Munugode Bypoll

తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది… రేపు మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది.. ఉప ఎన్నిక పోలింగ్‌కు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ బూత్‌కు చేరుకున్నవారికి కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు అధికారులు.. మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5,685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Read Also: Munugode Bypoll : పోలింగ్‌కు సన్నద్ధం.. మునుగోడు లెక్కిది..

ఇక, గురువారం రోజు పోలింగ్‌ కారణంగా.. మునుగోడ్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో రేపు సెలవుగా ప్రకటించింది ఎన్నికల కమిషన్‌.. ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు స్థానికంగా సెలవు అని పేర్కొంది ఎన్నికల కమిషన్‌. ప్రజలు అంతా పోలింగ్‌లో పాల్గొనే విధంగా చర్యలు ప్రారంభించిన ఎన్నికల సంఘం.. ఈ మేరకు సెలవుగా ప్రకటించింది… అయితే, మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోలింగ్‌ శాతం కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.