NTV Telugu Site icon

MLA Laxmareddy: మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు.. లక్ష్మన్నతోనే గ్రామ అభివృద్ధి

Mla Laxmareddy

Mla Laxmareddy

MLA Laxmareddy: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి పనులను ప్రజలకు చెబుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కిష్టారం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారికి వివరించాలని తెలిపారు. మంచి చేసే ప్రభుత్వని వదులుకోవద్దు అని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. వివిధ పార్టీలకు, సంఘాలకు, కులాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పోలేపల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా కురుమలు గులాబీ కండువా కప్పుకున్నారు.

అదేవిధంగా ఉదండాపూర్ యూత్ ప్రెసిడెంట్ విజేందర్, జడ్చర్ల మున్సిపాలిటీ 17వ వార్డు శాంతినగర్ కు చెందిన 40 మంది కారెక్కారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడు వచ్చి ఉచిత హామీలను ఇచ్చే నాయకులను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అధికారం ఇస్తే కనీస అవసరాలు అయినా నీళ్లు కరెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ను నమ్మి పొరపాటున ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని స్పష్టం చేశారు. తాగునీటికి ఇబ్బందులు మళ్లీ ప్రజలకు ఎదుర్కొన వలసి వస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని మరింత పెంచుకొని ముందుకు సాగాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కాగా కిష్టారం గ్రామస్తులు మాట్లాడుతూ.. కిష్టారం గ్రామంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దని అన్నారు. లక్ష్మన్న హయాంలోనే మా గ్రామ అభివృద్ధి చెందుతుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుధాకర్, మహేష్, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
IND vs NZ Toss: భారత్ టాస్ గెలిస్తే.. రోహిత్ శర్మకు సన్నీ సలహా ఇదే!