MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో పార్టీ శ్రేణులు ప్రచారాలు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతూ పార్టీ చేసే అభివృద్ది కార్యక్రామలు, పథకాలను వివరిస్తూ ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జడ్చర్ల, నవాబుపేట మండలాలలోని పెద్దపల్లి, చిన్నపల్లి, బండమిదిపల్లి, ఉదండపుర్, కిష్టారం, ఖానాపూర్, కొల్లూరు, కేశవరావుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ ప్రచారానికి గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారని.. పల్లె జనం నీరాజనాలు పలకుతున్నారని అన్నారు. కేసీఆర్ అంటే చేతల మనిషి అని, చెప్పింది చేసి చూపిస్తారని అన్నారు. మనం అడగకున్నా మన అవసరం ఏంటో తెలుసుకుని తీరుస్తారని తెలిపారు. అది కేసీఆర్ గొప్పతనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని.. అందుకే రాబోయే జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
Read also: Sachin Pilot: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే..
గత పది సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం, మైనార్టీ ఓవర్సీస్ పథకం, మైనార్టీ బంధు, ప్రత్యేక మైనార్టీ గురుకులాలు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుందని విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ.. గంగా జమున తెహజీబ్ కా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి.. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలంటే.. రెవెన్యూ మూడింతలు కావాలి