NTV Telugu Site icon

Kotha Manohar Reddy: పల్లెల్లో అడుగడుగున ఘన స్వాగతం.. కొత్త మనోహర్ రెడ్డి కి జై కొడుతున్న జనం

Kotta Manohar Reddy

Kotta Manohar Reddy

Kotha Manohar Reddy: అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే ఉండటంతో పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ వారి చేసిన అభివృద్ధిని తెలుసుపుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మహేశ్వరం నియోజకవర్గం BSP అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త మనోహర్ రెడ్డికి పల్లెల్లో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తుంది…సేవచేయడానికి డబ్బు, మద్యం, అధికారం ఏవి పనికిరావు అని నిరూపిస్తూ కొత్త మనోహర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. దీంతో కొత్త మనోహర్ రెడ్డికి పల్లె ప్రజా దండు జై కొడుతున్నారు. మాట ఇచ్చినట్టే మనోహర్ ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల ఉచిత స్థలం, కొందరు ప్రముఖులు కబ్జా చేసిన భూమిని పేద ప్రజలకు పంచుతూ ప్రజాదరణ పొందుతున్నారు.

ఇలాంటివి ప్రజలకు ఇంకా నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేదని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కబ్జాదారుల చేతుల్లో ఉందని ఆరోపించారు. బీఎస్పీకి ఓటు వేసి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కొందరు బీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు వలస పక్షులుగా వస్తున్నారని మండిపడ్డారు. వారిని నమ్మొద్దని ఆయన కోరారు. బీఎస్పీ అన్నీ వర్గాలకు సముచిత స్థానం కల్పించే పార్టీ అని తెలిపారు. మా పార్టీని ఆదరించాలని కొత్త మనోహర్ రెడ్డి కోరారు. ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 3 వేల మందికి 60 గజాల స్థలాలను అందించామని కొత్త మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏనుగుకు గుర్తుకు ఓటు వేయాలని బీఎస్పీకి గెలిపించాలని మనోహరన్ గెలిపిద్దామని ప్రజలు కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్ పెట్ కార్పోరేషన్ పరిధిలో మహేశ్వరం నియోజక వర్గం బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆయన సతీమణి కొత్త సరితా రెడ్డి గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త కొత్త మనోహర్ రెడ్డిని ఓటు వేసి గెలిపించాలని మహిళలను కోరారు. ప్రచారంలో భాగంగా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్న కొత్త సరితా రెడ్డి.. వారి సమస్యలను కొత్త మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు గ్రామం నుంచి ప్రారంభమై దాసర్ల పల్లి, దాసర్ల పల్లి తండా, మాణ్యగూడ, నేదునూరు, బాచుపల్లి, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళి నగర్, జైత్యారం, కొత్తగూడెం వరకు నిన్న కొనసాగింది.
Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు పోలీసులు మృతి