NTV Telugu Site icon

Dog attacks: కుక్కల దాడిలో మరో బాలుడు మృతి.. హన్మకొండలో ఘటన

Dog Attacks

Dog Attacks

Dog attacks: తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య వీధి కుక్కలు తెగ రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని అత్యంత కిరాతకంగా వీధి కుక్కలు దాడి చేయగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు ప్రతి ఒక్కరిని కలచివేశాయి. ఆ తర్వాత నుంచి రోజుకో చోట రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడి జరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. వీధి కుక్కల బెడద మాత్రం తొలగించలేకపోతుంది. ఎలాంటి చర్యలు తీసుకున్నా చివరకు చిన్నారులు మాత్రం కుక్కల దాడులకు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హన్మకొండ జిల్లాలో చోటుచేసుకోవడంతో

హన్మకొండ జిల్లాలో కాజీపేట పట్టణ పరిధి రైల్వే ఆవరణలోని నూతన చిల్డ్రన్ పార్క్ వద్ద ఏడేళ్ల బాలుడు చోటు ఆడుకుంటున్న సమయంలో అక్కడకు వీధికుక్కలు గుంపులుగా వచ్చాయి. కుక్కలను చూసిన చోటు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే వీధి కుక్కలు చోటుపై విచక్షణా రహితంగా ఒక్కక్కొటి దాడికి పాల్పడ్డాయి. వదిలించుకునేందుకు చోటు విశ్వ ప్రయాత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. కుక్కులు గుంపులుగా చోటుపై తెగపడ్డాయి. దీంతో చోటు సహనం కోల్పోయాడు. చివరకు చోటు కిందకు పడిపోగానే వీధికుక్కలు చోటుపై మెడపై, కాళ్లు చేతులు లాగుతూ ఈడ్చుకుంటూ పోయాయి. కుక్కాలు దాడితో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చోటు మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. దీంతో అక్కడకు చేరుకున్న చోటు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఆడుకోవడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయావా తండ్రి అంటూ కన్నీమున్నీరయ్యారు.

స్థానికులు మాట్లాడుతూ.. కాజీపేట పట్టణ పరిధిలోని 47, 62, 63 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయని భయపడుతున్నామని వాపోయారు. అంతే కాకుండా.. సాయంత్రం చిన్నారులు, వృద్ధులు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మార్నింగ్ వాక్ చేయాలన్న ప్రాణాలతో చెలగాటమేనని అంటున్నారు. ఒక్కరుగా వెళుతున్నట్లు కుక్కలకు కనిపిస్తే చాలు దాడికి తెగ బడుతున్నాయని భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల నుండి ఇప్పటి వరకు ఎనిమిది మందిని వీధి కుక్కలు స్థానికులపై దాడి చేశారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. త్వరగా చర్యలు తీసుకోవాలని లేకుండా పరికొన్ని చిన్నారులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: చేపలైనా మగాళ్లైనా మీకు పడాల్సిందే.. ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే

Show comments