Telangana Vehicles: వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Vehicles: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని గుర్తు చేశారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీజీని విమర్శించే వాళ్ళు.. ముందు టీఎస్ ఎందుకు పెట్టారో చెప్పాలి? అని మంత్రి ప్రశ్నించారు. ఆ తర్వాత టీజీ ఎందుకు మారిందో చెబుతామని క్లారిటీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో ప్రజలు తీసుకున్న ఆకాంక్షలను గౌరవిస్తూ టీజీగా మార్చినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని.. ఎక్కువగా ప్రయాణం చేసే డ్రైవర్లకు మరోసారి ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు.
Read Also: Earthquake : మణిపూర్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
తాజాగా.. కేంద్ర రహదారి రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించిందని దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్ తీర్మానం చేసింది. ఇకపై రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.
Bengaluru Water Crisis: బెంగళూర్‌లో నీటి కష్టాలకు కారణం ఏమిటో తెలుసుకోండి..
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!