NTV Telugu Site icon

సిఎం కెసిఆర్ కు ఈటల వార్నింగ్ !

సిఎం కెసిఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చురకలు అంటించారు. తన ఉనికిని దెబ్బ తీసేందుకు కెసిఆర్ సర్కార్ చాలా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గొర్రెల మంద మీద తోడేళ్ళు దాడి చేసినట్లు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారని…తెలంగాణ ఉద్యమంకు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మంత్రిగా బెదిరింపులకు దిగుతున్నారని గంగుల కమలాకర్ రావును టార్గెట్ చేశారు ఈటల. ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు గమనిస్తున్నారు..మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిచాల్సిన సమయం ఇది అని, రాజకీయాలు, వెకిలిచేష్టలకు ఇప్పుడు సమయం కాదని ఫైర్ అయ్యారు. ఇక నైనా కుట్రలు ఆపాలని..లేదంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈటల.