NTV Telugu Site icon

Delhi Liquor Scam: లిక్కర్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఈ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతుంది. ఈడీ విచారణలో ట్విస్ట్‌లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీ మరో అనుబంధ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అనుబంధ చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. ఇప్పుడు రెండు రోజుల్లో మరో అదనపు చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.

తాజాగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరో అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ప్రముఖ మద్యం వ్యాపారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌ల పేర్లను నమోదు చేశారు. ఈ కేసులో అమన్‌దీప్‌ అరెస్ట్‌ అయి 60 రోజులు కావస్తుండడంతో.. ఈడీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అమన్‌దీప్‌తో పాటు మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లైలను కూడా అరెస్టు చేయగా, ముగ్గురి పేర్లతో ఈడీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. కొత్తగా దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? దీనిపై ఇవాల (శుక్రవారం) ప్రత్యేక న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం విచారణ జరుపుతారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముగ్గురి పాత్రను ఈడీ చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఈడీ కేసులో మనీష్ సిసోడియాను ఏప్రిల్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రేపటితో కస్టడీ ముగియనుండడంతో ఈరోజు ప్రత్యేక కోర్టులో చార్జిషీటుపై విచారణ జరగనుంది. అయితే ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా.. మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 1న అమన్‌దీప్ ధాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మార్చి 6న అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాలోని సౌత్ గ్రూప్ ప్రతినిధిగా అరుణ్ పిళ్లై కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..